https://youtu.be/GBw6Q1dx8D8
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:యమన్ కళ్యాణి
జయకళ్యాణి వీణాపాణి శ్రీవాణీ
జయజయ భారతి జయసరస్వతి నీవే శరణాగతి
నడపవె నా మతి నిరతము సద్గతి
నమామి భగవతి బ్రహ్మసతి
1.వ్యాసపురీశ్వరి వాగీశ్వరి జ్ఞానప్రదాయిని
కాశ్మీరేశ్వరి ముఖనివాసిని కవన ప్రసాదిని
వర్గలువాసిని మేధావిని విద్యా వర్ధిని
అనంతసాగర గేహిని అక్షర వితరణి
2.శృంగేరి స్థిత శంకర పూజిత శారదామణి
కాళేశ్వర విలసిత సుస్వర రూపిణి వేదాగ్రణి
చింగావన స్థిరవాసిని సంగీత సామ్రాజ్ఞి
ధర్మపురీ గౌతమితీర వసని గీర్దేవి
No comments:
Post a Comment