Thursday, October 22, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను పిచ్చివాడన్నాడు ఒక తుచ్ఛుడు

నిను బిచ్చగాడన్నాడు ఒక త్రాష్టుడు

మతమునంటగట్టాడు ఒక మ్లేఛ్ఛుడు

ఆకృతులరంగు పులిమాడొక మూర్ఖుడు

సాయీ నీవే సత్యమైన అవధూతవు

సాయీ నీవే నిలువెత్తు మాన వతవు


1.సాటి మనిషిగానైన ఎంచలేని మూఢుడు

సాక్షత్తు దైవంగా నిన్నెలా నమ్మగలడు

నీ బోధల సారమే ఎరుగలేని జడుడు

సద్గురువునీవని ఎలా భావించగలడు

సాయీ నీవే సచ్చిదానందుడువు

సాయీ నీవే నిత్య జ్యోతిరూపుడవు


2.శిథిలమైన మసీదునీ ఆవాసమంటివే

పాలరాతి మందిరాలు పట్టిఉంచగలిగేనా

చిరుగుల కఫ్నీనీ నీ మేన దాల్చితివే

పట్టుపీతాంబరాలు నీకు కట్ట మెచ్చేవా

నీ జీవితవిధానమే ఆచరణ గీత

నీ నిరాడంబరమే స్ఫూర్తిదాత

No comments: