రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అతడు-కలయికలోనే కల నెలకొన్నది
అతడు-నెరవేరితే కల వరమౌతుంది
ఆమె:చెదిరిపోతే కలవరమౌతుంది
ఆమె:వలపను దానిలో వలదాగున్నది
అతడు-బతుకే చిగురించులే వలచినంతనే
ఆమె:వెతలే రగిలించులే వలపన్నింతనే
అతడు-1.పరిచయమైన తొలిక్షణమేదో తీక్షణమైనది
పరస్పరం ఎదురైన వీక్షణమే సలక్షణమైనది
ముడిపడిన బంధమే మూడు ముడులుగామారే
తోడుగా నడిచిన పథమే ఏడడుగులై సాగే
కలయికలో కన్న కల నెరవేరి వరమాయే
వలపంత కుమ్మరించ కాపురమే గోపురమాయే
ఆమె-2.తారసపడిన వేళయేదో వెంటాడే కాళమైనది
ఇరు మనసుల తొందరపాటే గ్రహపాటైనది
ప్రణయమూ పరిణయమూ నగుబాటైనది
సర్దబాటు బాటలేక బాస నీటి మూటైనది
కలలన్ని చెదిరిపోగా భవిత ఎడారిచోటైనది
వలపన్నగ చిక్కుబడి బ్రతుకు చితికిబాటైనది
No comments:
Post a Comment