రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
చెప్పిందే చెప్పితే చెప్పనీ
పాడిందే పాడితే పాడనీ
నిను పదేపదే స్మరించడం నాధ్యేయం
అదేపనిగ భజించుటే నా నియమం
నమోనమో ఈశ్వరా గిరిజా ప్రియవరా
శంభో శంకరా సాంబశివా శుభకరా
1.నిష్టగా నీ గుడికి చనకపోతిని
నా దృష్టిని మాత్రం నీనుండి మరల్చనైతిని
ఇష్టమే ఇందుధర నీఎడ కరుణాకరా
స్పష్టమే నినువినా ఒరులనెపుడు నమ్మరా
నమోనమో ఈశ్వరా గిరిజా ప్రియవరా
శంభో శంకరా సాంబశివా శుభకరా
2.వేదమంత్రాలనే వల్లించకపోతిని
ఎదలయలో నీనామం లయమే చేసితిని
వేదనే నీదిరా సదాశివా మోదమీయరా
నీ పదమే పరమపదము నాకిక దయసేయరా
నమోనమో ఈశ్వరా గిరిజా ప్రియవరా
శంభో శంకరా సాంబశివా శుభకరా
No comments:
Post a Comment