చరాచర జగత్తు నీవె వేంకటేశా
నిరామయ నిరంజన నిర్మల వేషా
కౌస్తుభ వక్షాంకిత మణిమయభూషా
వైజయంతి మాలాలంకృత సర్వేశా
అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము
అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము
1.మంజుల రూపము నీ మంజుల విగ్రహం
మంజుల వదనము నీ మంజుల వీక్షణం
మంజుల హాసము నిత్య మంగళ కరము
మనుజులకొక వరము నీ అభయకరము
అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము
అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము
2.నిను మోహించనీ మహా శివుడేడి విశ్వాన
నీ మాయకు లోబడని నరవరుడేడి లోకాన
జగన్నాటకంలో నడుపు నాపాత్రను నీ వైపు
శరణాగతి నొసగెదవని తట్టితిని నీ తలుపు
అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము
అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము
No comments:
Post a Comment