రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఓసాయీ శ్రీసాయీ-నీ రూపాలే మా మదిలో వెలిసాయి
ఓసాయీ మా సాయీ-నీ కన్నుల వెన్నెలలో మా బ్రతుకులు తడిసాయి
ఓ సాయీ ఓ సాయీ-నీ వాదుకొంటావని మా మనసులు వేచి చూసాయి
ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి
సాయీ సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ
1.సాయీ నీవున్న చోటల్లా హాయే హాయీ
హాయి ఉన్నచోటల్లా అది నీ కృపవల్లనేనోయీ
తెలవారునా కలతీరునా ఈ మా కష్టాల రేయీ
తినునంతలోనే జరిగింది ఏమో చేదాయెగా బ్రతుకు మిఠాయి
ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి
సాయీ సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ
2.వక్రంగ మారే మా నుదుటిగీత మరి మరి మార్చి రాయీ
నవనీతమైన నీ హృదయమేల అయ్యింది బండరాయి
అర్థాంతరంగా ఐనా సరే మా నాటిక తెరదించవోయి
ఏ నాటికైనా మా నాటికైతే వైరులకైనా వలదింక వలదోయి
ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి
సాయీ సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ
No comments:
Post a Comment