రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు
గురువే సాక్షాత్తు పరబ్రహ్మా
సాయీ సాయీ నీవే నా సద్గురువని నమ్మా
నన్నుద్ధరించు బాధ్యతను సత్వరమే చేకొమ్మా
1.లేనిపోని దుఃఖాలతొ దృష్టిని మరలించుతావు
చిరుచిరు వరములతో బులిపింప చూస్తావు
కోరాల్సిన పరసౌఖ్యము స్ఫురణకు రానీయవు
నిలువలేను ఒరకొనగా ఏల నన్నేలవు
సాయీ సాయీ నీవే నా సద్గురువని నమ్మా
నన్నుద్ధరించు బాధ్యతను సత్వరమే చేకొమ్మా
2.తమసోమా జ్యోతిర్గమయా ఈ జగమే మాయ
అన్యధా శరణంనాస్తి నీవే నాకు శరణమయా
భవజలధిని దాటింటే సరంగువే నీవయా
జన్మరాహిత్యమొసగు జగదీశుడ వీవయా
సాయీ సాయీ నీవే నా సద్గురువని నమ్మా
నన్నుద్ధరించు బాధ్యతను సత్వరమే చేకొమ్మా
No comments:
Post a Comment