రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఉల్లమే ఉల్లాసమొందితె-గడ్డిపూవూ అందమే
కాలమే అనుకూలమైతే-గాలి పాట గాంధర్వమే
మనసుకు తగిలించు కనులు-లోకమంతా అద్భుతమే
స్పృశించి చూడు ఎదలు-పరశాలు సాంతం సొంతమే
1.చిరు చిరు సరదాలతో భారమంత తేలికౌను
చిన్ని చిన్ని కానుకలే సంతృప్తికి మూలమౌను
ఇవ్వడంలొ పొందు మజా నవ్వులే పంచు సదా
గుండెలొకటొకటిగ కూర్చి కట్టాలి దండగా
మానవతకు అదియే అండ దండ దండిగా
2.ఉనికిని గుర్తించడమే ప్రతిమనిషికి ఊరట
కాసింత వెన్నుతట్టితే ప్రగతి బాటకు బాసట
ప్రేమిస్తే నష్ట మేముంది తిరిగిపొందడం మినహా
బ్రతుకు సాగిపోవాలి సీతాకోక చిలుకల తరహా
అనుక్షణము ఆహ్లదంతో అనిపించాలి ఆహాఁ
No comments:
Post a Comment