రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కదులుతున్న ఖజురహో సాలభంజికనో
హంపిలోని వంపులున్న లలన శిల్పమో
రామప్ప గొప్పగ చెక్కిన నాగిని పంచాణమో
చతురతన తీర్చిదిద్దిన చతురానను సర్గమో
చూపు శిలగమారే మనసు ఉలిగ తొలిచే
కన్ను స్థాణువాయే ఊహ చెలిగ తలిచే
1.రవివర్మ అంచనాను చిత్రంగ మించిపోయే
బాపుబొమ్మ సైతం ఎంచగా తూగదాయే
వడ్డాది కుంచె కూడ దించినది సరిపోదాయే
ఎంతగా గాలించినా నీవంటి చిత్తరువే లేదాయే
చూపు చిత్ర వస్త్రమాయే మది కుంచెగ మారిపోయే
కన్ను వర్ణాలు కలిపే ఊహ హృదయాన నిలిపె
2.కాళిదాసు శకుంతలే నిన్నుగని చింతించే
అల్లసాని వరూధినీ నిన్ను గాంచి ఈర్ష్యనొందె
రామరాజభూషణుని దమయంతి తలవంచే
బాణుని కాదంబరి నీ అందానికి కలతచెందె
చూపు కైపులోన మునిగె డెందమే కలమై చెలఁగే
కన్ను వెన్ను దన్నైనిలిచే ఊహ నిన్ను కవితగ మలిచే
No comments:
Post a Comment