రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
తొలి ప్రేమలొ దక్కని నా ప్రేయసి
మరలిరాదు మరి మరపురాదు
నా చెలి చేసిన తీవ్ర ఎద గాయమే
మానిపోదు మచ్చ మాసిపోదు
ప్రకృతిలోన ఏదైనా ప్రేయసి రూపంగా
నా గుండె కెలికి తీరిపోని శాపంగా
1.పున్నమి జాబిలి చెలి మోములా
చల్లని వెన్నెల నా సఖి కన్నుల్లా
విరిసిన మల్లెలన్ని తనవైన నవ్వుల్లా
విచ్చిన గులాబీలు సిగ్గుల బుగ్గల్లా
ప్రకృతిలోన ఏదైనా ప్రేయసి రూపంగా
నా గుండె కెలికి తీరిపోని శాపంగా
2.కారు మబ్బులే శిరోజాలుగా
నింగి తారలే సిగలో జాజుల్లా
గోదావరి గలగలలే ప్రేయసి ఊసులుగా
గాలిలోని గంధాలే చెలి చేసిన బాసలుగా
ప్రకృతిలోన ఏదైనా ప్రేయసి రూపంగా
నా గుండె కెలికి తీరిపోని శాపంగా
No comments:
Post a Comment