https://youtu.be/AZCXsBByjPA
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
జయగోదావరి మాత మాపాలిటి సౌభాగ్య విధాత
గౌతమ ముని తపఃఫలిత సంజనిత
శ్రీరామ పాద స్పర్శిత పరమ పునీత
హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత
పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత
1.అహల్యాసతి పాపము ప్రక్షాళణ జేసితివి
పాముకు శాపముబాపి మనుజ రూపమిచ్చితివి
త్రయంబకేశ్వరాన వెలసి సలిలరయమువైతివి
బాసరపురముకు అరసి తెలుగుల వరమైతివి
హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత
పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత
2.కృషీవల ఫలసాయార్జిత పరితోషిణి
విద్యుదుత్పత్తి కారిణి మానవ జీవతరంగిణి
.స్నాన పాన జప ధ్యానుల అను నిత్య స
కారిణి
నరసింహుని సేవకజన భవతాప హారిణి
హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత
పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత
OK
No comments:
Post a Comment