అరెరే ఎంతటి వైచిత్రి మన మైత్రి
ఎంతగానొ పావనము మన స్నేహము
చినుకులా కురిసింది కడలిగా మారింది
ఆది అంతమే తెలియకుంది వింతగా
నీవు నేను వేరంటేనే అది ఒక చింతగా
1. కాంతినిచ్చు దీపమైనా ఆరిపోతుంది
తావినొసగు ఏ పూవైనా వాడిపోతుంది
అందం తరుగుతుంది గంధం ఇగురుతుంది
చెక్కుచెదరదేనాటికి మన చెలిమి
ఖర్చెంతచేసినా ఒడవనిదీ ఈ కలిమి
2.దోస్తంటే నినదించే హృదయము
నేస్తం పరాయికాదు మన సమస్తము
అనురాగ ప్రతాపము త్యాగపు నిజరూపము
కలహించదు కుదురుకున్న మన చిక్కని సోపతి
కలనైనా విరహించదు మన అపూర్వ సంసక్తి
No comments:
Post a Comment