https://youtu.be/0PhNAzoNh5U
మెత్త'గా తాకావు నా హృదయాన్ని…
కొత్తగా పూచావు మధురమైన భావాన్ని…
మనసంతా నిండిపోయేలా
కలలన్నీ పండిపోయేలా
1.బదిలీ చెయ్యి నీ కోప తాపాలు
రుద్దెయ్యి నా మీద నీ అసహనాలు
అలకలు కినుకలు నా ఎడల ప్రయోగించు
భావోద్వేగాలన్నీ కేవలం నాకే పంచు
నరికినా నవ్వుతాను తరువులాగా
తప్పులు సరిదిద్దుతాను గురువులాగా
2.అందగజేస్తాను నీకు ఆనందాలన్నీ
ఊరేగిస్తాను నిన్ను అందలమెక్కించీ
ఆసరాగ నేనుంటా జీవితమంతా
ఆలంబన నేనౌతా ఒడిదుడుకుల చెంత
నిన్ను నీకు చూపుతాను అద్దంగా
అహర్నిశలు నీసేవకె నే సంసిద్ధంగా
No comments:
Post a Comment