https://youtu.be/rxh5OBp_Peg?si=k-yOLWgeiVN3L5kT
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:వాగధీశ్వరి
నను తరించనీ నీ సేవలో శ్రీ వాణి
నను గమించనీ నీ త్రోవలో కమలాసను రాణి
అవతరించినావే నను ఉద్ధరించగా
నా కవన వధూటివై ఆలంబననీయగా
నేటి మూలా నక్షత్రమందు నీ జన్మదినము
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు
1.కలిగించు యోగ లబ్ధి-చేకూర్చు భవరస సిద్ధి
ఓలలాడనీ నీ తన్మయాబ్ధి-వికసించనీ మంద బుద్ధి
పథనిర్దేశమునిపుడే కావించవే-సద్గతిని నాకందించవే
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు
2.ఉద్ధీపించు మూలాధారం-ఛేదించు నా సహస్రారం
చెలగనీ నాలోఒక్కో చక్రం-ఐక్యమై లోకాల కాలచక్రం
మరుజన్మేలేని పరమీయవే-నన్నిక వీడనని వరమీయవే
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు
No comments:
Post a Comment