Monday, August 30, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరుణ కలువ నీవు

కరుణ నొలుకు తావు

నీ మోము అనంద తావు

నీ మోవి దరహాస రేవు


1.సౌందర్య లహరి నీవు

శివానంద లహరివౌతావు

భవరోగ తిమిరాల దీపికవు

మాధవ హృదయ రాధికవు


2.నవరస పోషణివి

అల్ప సంతోషిణివి

మృదుమంజుల భాషిణివి

పరమపదాన్వేషిణివి

No comments: