Monday, August 30, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొంచం కొంచంగా చంపకే-పీకల్లోతులో ననుముంచకే

అందరిలా నన్నెంచకే-నీ ప్రేమను పరులకు పంచకే

గ్రహించలేవా నా మనసును

అనుగ్రహించలేవా అనురాగమును


1.ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడేను

చిల్లులు పడ్డ నావలా కడలిలొ మునిగేను

ఉగ్గబట్టుకుంటాను ప్రాణాలను సైతం

ఊపిరాపుకుంటాను నీ ఆనతి కోసం

ఔననలేవా అడియాస చేయక

నే మనలేనే నువు బాసచేయక


1.ప్రతిసారీ నీతో నాకు ఒక పరీక్షనే

కలవాలనుకున్నపుడల్లా కడు నిరీక్షణే

తిరుమలేశు దర్శనమే సులభసాధ్యం

నీ వీక్షిణ భాగ్యమే గగన సదృశం

తపస్సులే చేస్తున్నా కనికరించవే

నీకొరకే జీవిస్తున్నా నను స్వీకరించవే

No comments: