https://youtu.be/9ADf6y-cTA4?si=X_JB2IZbSi-T-zXR
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శంకర
గంగాంతరంగా నమో రామలింగా
నీ గళమైతె గరళసహితము
నా కంఠము ఏలనయ్య కర్కశము
తేనియ గీతముల నీ అభిషేకము
చేతును నాకీయవయ్య గాత్ర మాధుర్యము
1.పంచామృతధారలతో నమకచమక స్తోత్రముతో
పంచాననా నీకు పరిచారము లొసగెదను
మారేడు దళములతో నిన్నర్చించెదను
మార్ధవమే నాగొంతున పలికించగ ప్రార్థింతును
తేనియ గీతముల నీ అభిషేకము
చేతును నాకీయవయ్య గాత్ర మాధుర్యము
2.అనాలంబి వీణియధర సంగీత శాస్త్రకార
ఆనందతాండవ కేళీలోల నటరాజేశ్వరా
ఢమరుక వాద్యాన్విత లయయుత లాస్యప్రియ
శృతిపక్వ గమక గానవరదాయక పరిపాలయ
తేనియ గీతముల నీ అభిషేకము
చేతును నాకీయవయ్య గాత్ర మాధుర్యము
No comments:
Post a Comment