రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
తిక్కశంకరయ్యవే నువ్వు
వెర్రి వెంగళయ్యవే నువ్వు
చూడబోదుమా భళా భోళానాథుడవు
ఆగ్రహిస్తెనేమో ప్రళయకాల రుద్రుడవు
1.విరాగివనియందునా భార్యలేమొ ఇరువురాయె
యోగిగ నిన్నెంచమందువా ఇద్దరు కొమరులాయె
భోగిగ భావింతునా సర్వదా ధ్యానివి మౌనివాయె
సంసారిగ తలచెదనా సదా స్మశాన వాసివాయే
2.పసివాడి తలతెంచితివి నాడు క్రోధావేశాన
ఆలిని వరమడిగినా ఇస్తివి భక్తికి పరవశాన
భిల్లుడిగా మారి పోరి పాశుపతమునిస్తివి పార్థునికి
తిన్నని కన్నుని గ్రహించి కైవల్యమిస్తివా శరణార్థునికి
No comments:
Post a Comment