రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
బులాకిలో చలాకిదనం
ముక్కెరలో ముగ్ధతనం
కన్నులలో దివ్య తేజోదనం
పెదాలలో ప్రమోదావనం
దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే
జగానికే హితముకూర్చే అపూర్వజాతవే
1.రవిబిబంబం నుదుటదాల్చి
శశి చంద్రిక దృక్కుల నిలిపి
సదానంద ప్రసన్న రూపిణివై
చిదానంద ప్రశాంత ధారిణివై
సచ్చిదానందమయ స్వరూపవై
దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే
జగానికే హితముకూర్చే అపూర్వజాతవే
2.మంత్రముగ్ధులం నిను తిలకించి
కామదగ్ధులం నీ వదనం వీక్షించి
యోగదుగ్ధలం నీ కరుణ కాంక్షించి
నిత్య లబ్ధులం నీ కృప ప్రసరించి
తన్మయాబ్దులం నీ సన్నిధి దాల్చి
దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే
జగానికే హితముకూర్చే అపూర్వజాతవే
No comments:
Post a Comment