Monday, September 13, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క గుణింతమే కదా జీవితం

కనకం కాంత కిరీట కీర్తులకే అంకితం

కుడిచినదాదిగా అమ్మపాలు పసినాడు

కూలి పోయి చేరునంతదాక కాడు

అక్షరమై మొదలౌతుంది

అక్షరమై కడతేరుతుంది


1.కృష్ణగీతనాచరించ క్రూరకర్మలంతరించు

కెడయికయే నీడైనా కేలొసగిన తరించు

కైవల్యమె ధ్యేయముగా కొత్తెమలా విస్తరించు

కోరికనే త్యజించగా జీవన కౌతుక నిస్తరించు

అక్షరమెరుగుటయే ఆత్మజ్ఞానము

అక్షరముగ సాగాలి నిత్య ధ్యానము


2.కలియుగాన కాత్యాయిని కిణ్వ వారిణి

కీర్తన జేయగ కుమారసువు కూర్చు కూరిమి 

కృతకమాయె బ్రతుకు వికృతమాయే మేధ

కైంకర్యము చేసినంత కరుణించును జనని క్షేమ

అక్షరముతొ సావాసము

అక్షరమున ఆవాసము

No comments: