Monday, September 13, 2021

https://youtu.be/l7EJPdOMVQo?si=MrzE65Gz4DC8bTlX

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :హిందోళం

ఆరాధనంటే ముజ్జగాలలో ఆరాధదే
అద్వైతమంటే అది రాధామాధవీయమే
రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస
కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస

1.ఇహమును విరమించి అహమున రమించే
పరమాత్మనే తన అంతరాత్మలో గాంచే
జీవనసాగరాన అంతర్మథనమే గావించే
సంగమ సాఫల్యమందు సుధనే సేవించే
రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస
కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస

2.పరమానందమందు పరవశమొందే
పరస్పరం పరిష్వంగ తన్మయమే చెందే
అధరపుష్పాలలో మకరందము నందే
బింబము ప్రతిబింబము ఐక్యము నొందే
రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస
కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస


No comments: