సౌమిత్రి సతి సల్పినా ..త్యాగమ్ము కొనియాడ తరమాయేనా..
ఊర్మిళా పాతివ్రత్యమ్ము ..ముల్లోకముల కాదర్శ ప్రాయమేగా
1.అన్న మాటను అన్న బాటను
జవదాటనీ..పతి లక్ష్మణ స్వామినీ
బాసటగ నిలిచి సాగనంపింది
సాధ్వి ఊర్మిళ తా సగర్వమ్ముగాను
2.జనకుడి౦టను జన్మ దాల్చిన రాణి
దశరథుడి కోడలై అడుగిడిన పూబోణి
అచ్చటా ముచ్చటా తీరలేదెచ్చట
పతియానతిని ఎపుడు మీరలేదకటా..
3.మగడు తగదన్న నిదురను తాను గైకోన్నది
పదునాలుగేళ్ళు మగతలో తానున్నది
భ్రాతృ సేవకు లక్ష్మణుడు విశ్వ విఖ్యాతుడాయెగా
రామాయణమ్మున ఊర్మిళ పాత్ర చిరస్మరణీయ మాయెగా
No comments:
Post a Comment