https://youtu.be/JYHebUTjLE8
ఇందిరా రమణా నీకిరు ఇంతుల పోరు ఎంతయా
పద్మావతి వల్లభా ఒక్కరైనా సరే నా అలవికాదయా
నీకు నీ సతుల వల్ల యాతన చాలదనా
నాకు ఊఢనంటగట్టి వినోదింతువేలయా
1.సంసార సాగరం దుఃఖం నానుడి వినలేదా
ఏక మార్గ ద్వారం కాపురమని నీకేరుకేలేదా
మరణమొక్కటే త్రెంచగలదు నా భవబంధం
నీ సన్నిధి మాత్రమే నాకు అనంతమైన ఆనందం
2.అరవయేళ్ళ జీవితం ఇంతటితో ఇక చాలు
క్షణమైనా మనలేను శరణు నీ పాదాలు
సుఖసంతోషాలు కొల్లగొడితె మానె స్వామి
విముక్తైన ప్రసాదించి నను కడ తేర్చవేమి
No comments:
Post a Comment