రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మెదడు తొలుస్తున్నావే కుమ్మరి పురుగువై
చెవిలొ పాడుతున్నావే తుంటరి దోమవై
మనసు గ్రోలుతున్నావే తమకపు తుమ్మెదవై
దాడి చేస్తున్నావే తలపులపై నీవే తేటీగవై
ఎలా తట్టుకోనే ఇంతటి నీ ప్రేమ ఒత్తిడి
చిత్తమంత చేసావే పుత్తడిబొమ్మా చిత్తడి చిత్తడి
1.మరాళమే మరలిచూచు నీ హొయలుకు
మయూరమే పురులు విప్పు నీ కురులకు
చకోరమే శశిని మరచు వెన్నెల నీ మేనని
పికమే భావించు కిసలయమని నీ మోవిని
ఎలా తట్టుకోనే ఇంతటి నీ ప్రేమ ఒత్తిడి
చిత్తమంత చేసావే పుత్తడిబొమ్మా చిత్తడి చిత్తడి
2.కస్తూరి విస్తుబోవు నీ దేహపు నెత్తావికి
నాగులెన్నొ నిన్నుజేరు మొగిలి వేదు గాత్రానికి
సీతాకోక చిలుకలే వాలి అతికేను నీ ఒంటికి
చాతకమే పరితపించు చెలీ నీ హర్ష వర్షానికి
ఎలా తట్టుకోనే ఇంతటి నీ ప్రేమ ఒత్తిడి
చిత్తమంత చేసావే పుత్తడిబొమ్మా చిత్తడి చిత్తడి
No comments:
Post a Comment