రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఆవిష్కరించావు నాలో నేనెరుగని అందాలెన్నో
జాగృత పరిచావు ఏవో తీయనైన తాపాలెన్నో
మూల్గుతోంది నాదేహం తన్మయమై తమకాలు సైచక
నీల్గుతోంద నా పొంకం తన పొగరణిచేయు వారులేక
ప్రియసఖా రా రసిక శేఖరా సుఖాల ముంచివేయగా
ఇంద్రధనువు నాతనువు ఎక్కిడి స్వర్గాన్ని గెలిచేయగా
1.మొహంవాచి ఉన్నది పురుష స్పర్శ అన్నదే ఎరుగక
ఇహం మరచి పోయేటి స్వప్నమాయె ఒక మరీచిక
నీ ఊహయే నా జీవన ఎడారికి అమృత వర్షసూచిక
నీ రాకయే వయసు వేసవికి ఆహ్లాద మలయ వీచిక
ప్రియసఖా రా రసిక శేఖరా సుఖాల ముంచివేయగా
ఇంద్రధనువు నాతనువు ఎక్కిడి స్వర్గాన్ని గెలిచేయగా
2.ఎదిరిచూసె నా అధరాలు మధువు గ్రోలు వారు లేక
మదనపడె పయోధరాలు మధించు ఆదరణ నోచక
ఎడబాటునోపకుంది సడలిననానడుము ఎవరు బంధించక
యవ్వనాన్ని ఎరవేసితి మ్రింగగ తిమింగలానికేమాత్రం వెరవక
ప్రియసఖా రా రసిక శేఖరా సుఖాల ముంచివేయగా
ఇంద్రధనువు నాతనువు ఎక్కిడి స్వర్గాన్ని గెలిచేయగా
No comments:
Post a Comment