Monday, October 11, 2021

https://youtu.be/ZtCqfuA6cPE

మా ఇంటి తులసిదళం ఆశ పడ్డది 

నీ ఎదపై మాలగా మెరవాలని

మా తోటబంతిపువ్వు ఆరాట పడ్డది

దయతో  నీపాదాల తననివాలని

తిరుమలేశ తులసిదళమె నా హృదయం

వేంకటేశ బంతిపూవు నా నయనం


1.నా ప్రాణ దీపానికి ఒకటే తపన

కలకాలం నీ ఎదుట వెలగాలనీ

నా రసన జపమాల అభిలాష

నిరతము నీనామం పలకాలనీ

తిరుమలేశ చేసేశా  ప్రాణాలు నీ పరం

వేంకటేశ వేడుకుంటి నీ తలపే నా వరం


2.నా గుండె సవ్వడినీ గుడిగంట కానీ

నీ దృష్టి నాపైన నిలుపునట్లుగా

నా ఊపిరేనీకు వింజామరయవనీ

నీ సేదతీర్చుతు కడతేరునట్లుగా

తిరుమలేశ నిమిషమైన నీ ధ్యాసలో

వేంకటేశ వేడ్క తీర్చు ఈ జన్మలో

No comments: