https://youtu.be/_5Hh5iAx5Bw?si=o_kZ1XBOQzX5B3dk
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:సింధుభైరవి
నేనేమో సాహిత్యం-నీవేమో సంగీతం
ఇరువురి సంగమం అద్భుత రసమయ గీతం
నాదేమో అక్షర శరం నీదేమో స్వరమాధుర్యం
వశమైపోదా ఎక్కిడితే సర్వం సహా జగం
పరవశమైపోదా ఎలుగెత్తితే సకల విశ్వం
1.చైతన్యపు ఘన మేఘం నేనేగా
నురగలెత్తు సాగరకెరటం నీ నవ్వేగా
అందుకొనగ ఆత్రంగా ప్రేమసూత్రంగా పవిత్రంగా
అల్లుకొనగ హర్షంగా ఉధృత వర్షంగా ఆదర్శంగా
పదమై పల్లవై రాగమై అనురాగమై జతులై గతులై
చరణాలే వడివడి సాగగా- కడలి ఒడిలో కడతేరగా
2.ప్రత్యూషపు రవి బింబం నేనేగా
సరస్సులో అరవిందం నీ అందమేగా
తొలికిరణం నిను చేరిన తరుణం స్వర్ణంగా ప్రణవార్ణంగా
సితగా వికసితగా అధర హసితగా విలాస విలసితగా
ధన్యవై అనన్యవై ప్రావీణ్యవై ప్రాధాన్యవై మాన్యవై శరణ్యవై
భవమే భావమై అనుభవంగా- విభవమే సంభవమై మిథునంగా
No comments:
Post a Comment