https://youtu.be/dWKJdu3Llm0?si=SQE-EBioOIv23I6j
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మాయామాళవగౌళ
మూడు కన్నుల వాడ ముల్లోకాల రేడ
శివుడా శివుడా ఏడ నీ జాడ
రికామె లేదాయే ఎములాడ కాడ
కాసింతైన నన్ను దయజూడ
1.సోమారమెపుడైన సోకదు నీ నీడ
శావణమైతేనొ సోచాయించను గూడ
శివరాత్రి నాడైతె నిన్ను వేడనె వేడ
గుండెలో కొలువుండు తండ్రి రాయేశుడ
2.ఉపాసమొల్లను ఉండను తినకుండ
జాగారం చేయను రేయి నిదరోకుండ
ప్రతి పనికి మానను శివశివ అనుకుండ
జంగమయ్య నీవే మాకు అండాదండా
No comments:
Post a Comment