https://youtu.be/Y-bOneytBhg
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అంతగా మునిగావా రాముని ధ్యానంలో
వింత ఏముంటుంది ఉంటే స్వామి మైకంలో
చింతలే పట్టవా పవనాత్మజా మాదైన ఈ లోకంలో
చింతన నీదే ఇక నిరంతరం కాచేంతవరకీ నరకంలో
రామలక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ
1.గల్లంతాయే ఎపుడో మానవత్వ మైథిలి
లంకలోనో ఏ డొంకలోనో ఆచూకి కనుగొనాలి
లంఘించే శక్తిలేదు లాఘవముగ కడచ కడలి
లంఖిణి మదమునణిచి వెదకి వెలికి తీయాలి
రామలక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ
2.హానిగొలుపు క్రిముల నుండి జనుల కావుమా
సకలరోగ సంజీవని మాకై చేగొనితెమ్మా హనుమా
స్వార్థం అసంతృప్తి అశాంతులే మా మనాదులు
గ్రహించనీ మము నీ అనుగ్రమున మా విధులు
రామలక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ
No comments:
Post a Comment