Monday, January 10, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వలపుల వలన చిక్కవెందువలన

నీ కనులు మీనాలే కదా ఓ లలన

ముత్యాలు దొరుకు నేల నీ కడ  కడలే లేకున్నా

 నీ పెదవి అల్చిప్పల నవ్వులె మౌక్తికాల సృజన

స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి

నందించని బ్రతుకుండదు  మది పులకించి


1.కాళిదాసులౌతారు నీ ఎదుట నిరక్షరకుక్షులు

తెనాలి రామకృష్ణులౌతారు నీవల్ల అజ్ఞాన పక్షులు

వరదలై పారుతాయి కవితలు కవితలనుండి

వరములై  తీరుతాయి కన్నకలలు కాస్తపండి

స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి

నందించని బ్రతుకుండదు  మది పులకించి


2.బింకమొదిలి చూసేరు నీవంక ఏదోవంకతో 

తహతహలాడేరు పలకరింప ఏదో టొంపుతో

వరుసకట్టి నిలిచేరు సామ్రాట్టులు నీ క్రీగంటి వీక్షణకై

రేబవళ్ళు పహారా కాసేరు ఈగవాలనీకుండ నీరక్షణకై

స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి

నందించని బ్రతుకుండదు  మది పులకించి

No comments: