Friday, May 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళం


నేడు పావన శనివారం ప్రభో వేంకట రమణా

మేము నీవారం నీకై ఆశపడే వారం  స్వామీ కరుణా భరణా

మా వేదన నార్చేవాడివని

మా వేడ్కలు తీర్చే ఘనుడవని

నమ్మి వేచియున్నాము అర్ధ దశాబ్దం

నిను చూడబోతేనేమొ నీరవమౌ నిశ్శబ్దం

గోవింద గోవింద గోవింద గోవింద 

గోడునాలకించరా

గోవింద గోవింద గోవింద గోవింద

కేళి చాలించరా


1.ఉలకవు పలకవు బండరాయికి మల్లె

కదలవు మెదలవు తండ్రీ నీకె చెల్లె

నిదురబోతె మానే పాడగవచ్చు లేపగ సుప్రభాతాలు

నిదుర నటిస్తే మేల్కొలుపగ తరమా

వృధాప్రయత్నాలు

గోవింద గోవింద గోవింద గోవింద గోడునాలకించరా

గోవింద గోవింద గోవింద గోవింద

కేళి చాలించరా


2.నటనలొ నువు దిట్టవే నటన సూత్రధారీ 

పాత్రలమే నీప్రేమ పాత్రులమే ఘటనాఘటన చక్రవర్తీ

బురుదలొ తోసింది నీవె మేము నీళ్ళకొరకు మ్రొక్కాలా

మాయల లోయలొ పడవేసింది నీవే

ఏడుకొండలెక్కాలా

గోవింద గోవింద గోవింద గోవింద గోడునాలకించరా

గోవింద గోవింద గోవింద గోవింద

కేళి చాలించరా

No comments: