Friday, May 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూపు తిప్ప నీయవేమె నీ సోయగాలు సూదంటురాళ్ళు

రెప్పవేయ కుంటెనేమొ  చెలమెలా ఊరెనె

కళ్ళలో నీళ్ళు

మసకబారి పోయాయి నా కనుగిలుపక నా చూపులు

ఐనా సరె గ్రోలెద నీ అపురూప అందాలు పొద్దమాపులు


1.కళ్ళలోనే చెలీ నే కాపురముందునే 

నీ కనుపాపల ఊయల లూగెదనే

కాటుకగా మారి నీ కనులను అలరించెదనే

కన్నీరు చిప్పిలకుండా సంతసాలముంచెదనే

నే కూరుక పోయానే నీ నయన ఊబిలో

తేరుకోలేకున్నానే  పొడగాంచి నీ మత్తులో


2.ముంగురులు ముందుకుదూకి నిమిరేను నీ నునుపు చెంపనే

చెంపలే పొంగుక వచ్చి గిల్లమనేలా నాకు ఎంతో ముద్దొచ్చెనే

ముద్దుపెట్టకోమంటూ ఊరించే పెదాలే ముంచెనా కొంపనే

కొంపంటుకొంటుందేమో అంటించినావే నా విరహ కుంపటే

చంపడం నీకెంతో తేలికే ఊపిరాడకుండ జేసీ

బ్రతికించడం సులభమే నీ నవ్వుల సుధలే కురిసీ

No comments: