https://youtu.be/IS5ck9vmWdc?si=bXPsc27mf7R5edtw
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : శివరంజని
సౌందర్య నిధినీవే-నా జీవన కౌముదివే
నిశీధులన్ని నీవల్లే ప్రకాశించినాయి
మధురానుభూతులెన్నో సంప్రాప్తమైనాయి
కొనసాగింతునే…నా ప్రేమ ఏడు జన్మలదాకా
క్షణమైనా మనలేనే చెలీ నీతోడు లేక
1.నిర్జన ఎడారులే నిన్నటి నా బ్రతుకంతా
బ్రహ్మజెముళ్ళే నే నడిచిన దారంతా
అలమటించి పోయాను ప్రేమరాహిత్యంతో
పరితపించిపోయాను నే తీరని దాహంతో
శ్రావణ మేఘమై అనురాగం కురిసావే
శరత్తు చంద్రికవై ఆహ్లాదం పంచావే
2.నిండైన జాబిలికి చెట్టుమచ్చనే అందం
నీ నగు మోముకు మోవి పుట్టుమచ్చ అందం
అందాలన్ని ఒక్కదిక్కే కుప్పబోస్తె నీ చందం
కనుగిలుపక నిన్ను చూస్తే అంతులేని ఆనందం
రాయంచలు వయార మొలుకు నీ కులుకులు నేర్వంగా
రాచిలుకలు పలుకులు చిలుకు నీవే గురువని గర్వంగా
No comments:
Post a Comment