https://youtu.be/9uy4ZOM01y0
రాగం:తోడి
కృతిరచించ నాతరమా రమాధవుని మహిమను
శ్రీ నరసింహావతార గాథను
వినిననూ చదివిననూ తరింపజేయును మానవ జన్మను
నుడివినను పాడినను అంతరింపజేయును అఘమును
1.సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులను
స్వామి దర్శనార్థమై వైకుంఠమేతెంచినంతను
అడ్డగించ ద్వారపాలకులా జయవిజయలను
కోపించి శపించగా మునులా భృత్యులను
శ్రీహరి కృపనొంది జన్మించిరి
హిరణాక్ష హిరణ్య కశిపులుగాను
1.హరి వైరిగా చెలరేగెను హిరణ్య కశిపుడు
గడగడలాడెను శచీపతి తన పదవి గతించినప్పుడు
నారాయణ మంత్రమొసగినంత నారదుడు-
హరి భక్తుడాయె గ్రహించి దితి సుతు సతి గర్భాన ప్రహ్లాదుడు
2.హరి తన పాలిటి అరి యని
వారించె హరిని స్మరించ జనకుడు ప్రహ్లాదుని
సర్వాంతర్యామి మహా విష్ణువని
కొలిచి తరించమనె తన తండ్రి హిరణ్య కశిపుని
ఏడిరా శ్రీహరి ఇందు కలడాయని మోదెను వెనువెంట ఎదుటగల స్తంభాన్ని
3.వరగర్వితుడా దైత్యుని దునుమాడగ
నరహరి మహోగ్ర రూపమ్మున వెలువడగ
కోఱలతో గోరులతో హిరణ్యకశిపుని చీల్చి చెండాడగ
శాంతింపమని ప్రహ్లాదుడు నరసింహుని వేడెగా
No comments:
Post a Comment