https://youtu.be/jytjkP0zDxU?si=fFS36yXrw1rWbXNz
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అర్చించనీ అనవరతం
అక్షరాల పూలతో పదముల సుమ మాలతో
పాడనీ నినుకొనియాడనీ
నీవొసగిన గాత్రంతో ఏకాగ్ర చిత్తంతో
భారతీ నా బ్రతుకే నీకు హారతి
మాతా సరస్వతీ నీవే శరణాగతి
1.ఏ మార్గమైనా నీ వైపే సాగనీ
ఎదలయగా నీనామం నాలో మ్రోగనీ
నా రచనలన్నీ రంజింపజేయనీ
గళమే మనోహరమై వీనుల విందవనీ
భారతీ నా బ్రతుకే నీకు హారతి
మాతా సరస్వతీ నీవే శరణాగతి
2.సాహిత్యమే ఎరుగని ఓ పామరుణ్ణి
నా కవనమంతా నీ కరుణా కటాక్షమే
సంగీతమేమీ తెలియని లల్లాయిగాణ్ణి
ఈ స్వరకల్పనంతా నీ సేవా విశేషమే
భారతీ నా బ్రతుకే నీకు హారతి
మాతా సరస్వతీ నీవే శరణాగతి
No comments:
Post a Comment