రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కవనవనంలో విరబూసిన పూవును
వాసనలంటూ గాఢత విరజిమ్మను
వర్ణాలు విరివిగా కనులకు వెదజల్లను
రెక్కల లాలిత్యం ఏమాత్రం ఎరుగను
నేనొట్టి గడ్డిపువ్వును పేలవమైన నవ్వును
1.ఏ చేయో నను కోయగ కోమలి కొప్పున నిలవాలనీ
ఏ గాలో నను మోయగ శ్రీ రాముని చరణాల వాలనీ
మహనీయల గళసీమన మాలగానైనా అలరారాలనీ
మట్టిలో మట్టిగ వొట్టిగ నే వసివాడి కడకిక నేలరాలనీ
నేనొట్టి రాతి పువ్వును పేలవమైన నవ్వును
2. ఎన్నడూ తోటమాలి పోయనే పోయడు నీరు
దారిన వెళ్ళే దానయ్యలు సైతం నను పట్టించుకోరు
జీవశ్చవమై నేనెవరికీ ఏ మాత్రం కొఱగాని తీరు
పేరుకే విరినై నిస్సారంగా ఆవిరినై బ్రతుకే కడతేరు
నేనొట్టి రాలు పువ్వును పేలవమైన నవ్వును
No comments:
Post a Comment