https://youtu.be/Ne7YomP-Cpo
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:చక్రవాకం
సర్వేశా శేషశాయి వేంకటేశా
సర్వదా వేడెదా నిను శ్రీనివాసా
పాపనాశా శ్రీశా శ్రిత జన పోషా
నీ సేవకు నా బ్రతుకే ధారపోశా
1.సరసాలలొ మునిగావా సతులతో
శరణాగతి కోరినా వినవా నతులతో
ఎంతగా ప్రస్తుతించానో సన్నుతులతో
కనికరించవైతివే స్వామి సద్గతులతో
2.విషయ వాసనలు నన్ను వీడవాయే
విషమ పరిస్థితులే ననువెన్నాడెనాయే
విషము మ్రింగ గళమాగిన సమమాయే
విష్వక్సేన వినుత మనసు నీ వశమాయే
No comments:
Post a Comment