https://youtu.be/Y2EXns2s1wE?si=wI8ZtABP4ilepCZJ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:భాగీశ్వరి
నీ అభయహస్తము దీనుల ప్రియ నేస్తము
శ్రీ వేంకటేశ నీ మహిమలు కడు ప్రాశస్త్యము
తరించె నిను సేవించి లోకాస్సమస్తము
గోవింద నీనామ సంకీర్తన కలిగించు పారవశ్యము
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా
1.నీ దివ్య దర్శనము మహదానందము
నీ పాద తీర్థసేవనము అకాల మృత్యుహరణము
నీ శఠగోప శిరోధారణము అహంకార దమనము
నీ లడ్డూ ప్రసాద స్వీకారము ఆరోగ్యదాయనము
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా
2.పుష్కరిణీ పుణ్య స్నానము ఘోరపాపనాశనము
తిరుమలలో గడుపు ప్రతిక్షణము మోక్ష కారకము
నీ సన్నిధి శయనము స్వప్నసాక్షాత్కార అనుభవం
ఆపదమొక్కులవాడవంది నీ సార్థకనామధేయము
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా
No comments:
Post a Comment