https://youtu.be/zPZv2se6Fmc?si=Xz3x5aI9D3kDuoqs
రచన .స్వరకల్పన&గానం:డా.రాఖీ
అజాగళ స్తనాలైనాయి దైవమిచ్చిన పాటవాలు
దున్నపోతు మీద వాన చినుకులై హితవచనాలు
సార్థకత చేకూరాలి మహోన్నత మానవ జన్మకు
ప్రతిక్షణం వినియోగపరచాలి ఆనంద మందేందుకు
1.ఎవరూ తోడురారు ఇది మహాప్రస్థానం
ఏది వెంటరాదు ఐనా ఆగదు ఈ గమనం
వదిలేయటమే అలవాటై సాగిపోవాలి మనం
చరిత్రలో నిలిచిపోవడం ఉత్కృష్ట కామనం
2.ఎంతగా కోరుకుంటే అంతదూరం కోరిక
మనదంటూ లేకుంటే బ్రతుకుంతా హాయిక
నీతో నీవు గడపడానికి చేసుకో క్షణం తీరిక
తెలిసి అడుసు తొక్కడమే నరలోకం తీరిక
No comments:
Post a Comment