Tuesday, December 13, 2022

 https://youtu.be/RRjBJUMKSaQ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పిల్లనగ్రోవి నా మోవే-ఉల్లము నీ తావే

నీ ఉనికిని తెలిపేను మొగిలిరేకు తావే

వదలక నను ముద్దూమురిపాలలొ ముంచుతావే

వేణుగోపాలా మువ్వగోపాలా నందగోపాలా

వందనాలు వందనాలూ ఆనందగోపాలా


1.నా అధరము మృదువుగ నీవందగను

సుధలూరును మధుర నదమూ పారును

వనమాలి శిఖిపింఛమౌళి రాసకేళి తలచను

మరులూరును మనమున మయూరమాడును

వేణుగోపాలా మువ్వగోపాలా నందగోపాలా

వందనాలు వందనాలూ ఆనందగోపాలా


2.దోబూచులాడేవు నా మది గది లో నక్కి

దొంగాటలాడేవు  నెమ్మదిగా నాలో నను నొక్కి

తిప్పలుబడి పట్టినా తప్పించుకుంటావు చిక్కినట్టె చిక్కి

తరింపజేయరా అలసితిని ఇకనైనను నాకు దక్కి

మదనగోపాలా కదనగోపాలా ఎద సదన గోపాలా

కృష్ణ గోపాలా నీపై తృష్ణ గోపాలా నీ లీలనాపాలా

No comments: