Wednesday, December 14, 2022

 

https://youtu.be/4wjTJVmoTag?si=vGWBIYjGgkFhDhtl

19) గోదాదేవి పందొమ్మిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:కాపి


కాటుక కళ్ళతో కళకళలాడే నీలాదేవీ నీకు వందనం

కనికరముతొ సడలించు స్వామికి నీ కౌగిటి బంధనం

మత్తిలి నిదురించసాగే నీలాధవుడు మాధవుడు

వత్తిగిలి పడుకోక ఇరువురు లేచి మము దయగనుడు

వ్రతముపూర్తి చేయించి మాకు వరములొసగుడు


1.వేకువ తలపించదు వెలిగే దీపపు సెమ్మెలతో

లేవాలనిపించదు పడక దంతపు మంచమ్ముతో

నీలా కావలించగా ఏదీ కావాలనిపించదుగా శిఖిపింఛమౌళీ

నిదురలేవవయ్యా మమ్ముద్ధరించ చాలించి నీకేళీ


2.ఎవరికి మాత్రము వదలగ తరము ప్రియపతిని

చివరికి మాకైనా వీడగకాదువశము నీ స్థితిని

నీలాసుందరీ గొప్పమనసు నీది మన్నించు మా అల్ప మతిని

స్వామిని ప్రేమతో మేలుకొలుపగలిగేది నీవేనని నమ్మితిని

No comments: