Tuesday, January 10, 2023

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:శివరంజని


నే పుట్టీపుట్టగానే కలం పట్టీపట్టగానే

మొదలెట్టా నీపై చెలీ ఇలా కవితనల్లడం

నీ అపురూప ముగ్ధ మనోహర సౌందర్యం వర్ణించడం

లలిత లావణ్యమౌ నీ మంజుల హాసం ప్రస్తుతించడం

అరవయేళ్ళొచ్చినా అయిపోలేదు ఆ కవనం

ఆపను నీతో నా ఆఖరి శ్వాసదాక ఊహా సహజీవనం


1.నీతో ఉన్నంతసేపూ నా ఎదర వసంతమే

పగలైనా వెన్నెల చిలికేను నీ మధుర హాసమే

మంచులా కరుతుంది సమయం విస్మయంగా

యుగాలైనా క్షణాలై రెప్పపాటే నీతో జీవితంగా

అరవయేళ్ళొచ్చినా అయిపోలేదు ఆ కవనం

ఆపను నీతో నా ఆఖరి శ్వాసదాక ఊహా సహజీవనం


2.మనమున్నదే లోకమై,లోకులెవరూ లేనిదై

నిన్ను చూస్తూ కాలాన్ని భోంచేస్తూ నీ ధ్యానినై

కాగితాలు చాలవు నా గేయం ఆగని హయమై

లక్షణాలు లక్షలై పాటే నీవుగా ధ్యేయం కావ్యమై

అరవయేళ్ళొచ్చినా అయిపోలేదు ఆ కవనం

ఆపను నీతో నా ఆఖరి శ్వాసదాక ఊహా సహజీవనం

No comments: