https://youtu.be/NjmsA8nMfVU?si=9Jc9NcP6D8nTG7rU
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:ముఖారి
విశ్వనాథుడు విశ్వేశ్వరుడు
విశ్వానికి మూల పురుషుడు
విశ్వతేజుడు విశ్వాత్ముడు
విశ్వసించదగిన భక్తపరాయణుడు
శివుడు సదా శివుడు సాంబ శివుడు భవుడు
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ
1.గరళము మ్రింగిన సరళ హృదయుడు
పిలిచిన పలికే భోలాశంకరుడు
సరగున బ్రోచే కరుణాకరుడు
బాలకుడా మార్కండేయ వరదుడు
శివుడు సదా శివుడు సాంబ శివుడు భవుడు
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ
2.త్రిపురాసుర హరుడు భవహరుడు
త్రిలోకపూజ్యుడు త్రిగుణాతీతుడు
త్రిభువన సుందరి ప్రియవరుడు
త్రినేత్రుడు శంభుడు త్రిశూలధరుడు
శివుడు సదా శివుడు సాంబ శివుడు భవుడు
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ
No comments:
Post a Comment