Sunday, January 22, 2023

 

https://youtu.be/PA38Bj-xPpQ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మరుగు పరచినాను మనసులో నీ చిత్రాన్ని 

పదిల పరచినాను మదిలోన నీ తలపులని

ప్రతీకగా ఏదో ఒకదాన్నీ-నీవే అనిపించిన ప్రతిదాన్నీ

జత పరచుతాను ప్రతి కవితకు-శ్రుతి కలుపుతాను గీతానికి,ఊహకు ఊతానికి


1.చిత్తరువులొ ఏదో ఒకటి-నీ సాటికి పోల్చుకొని

సొగసులలో మిలమిలలేవో నీవిగా భావించుకొని

ఏ మాటా రాకూడదని ఇబ్బంది పడకూడదని

నాకు నేనే తృప్తి పడి వెలువరిస్తున్నా చిత్రకవితని

కవితకు చిత్రాన్ని


2.బిడియమెంతొ పడుతూనే బింకాన్ని నటియించి

హృదయానికి చేరువ అవుతూ దూరాన్ని పెంచి

వదలలేకా చేపట్టలేకా సాకులేవో బుకాయించి

ఆటాడుకుంటూనే ఉంటావు నా కవిని ప్రేమించి

నన్ను తప్పించి

No comments: