Sunday, January 22, 2023

 

https://youtu.be/zNp94vR3ius

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


జయము జయము మహాకవీ వాచస్పతికి

జేజేలు జేజేలు సంస్కృత సారస్వత మూర్తికి

శ్రద్ధాంజలి శ్రీభాష్యం విజయసారథీ ఆచార్యులకు

జోహారు జోహారు సంస్కృత భారతీ గురువర్యులకు


1.జన్మించిరి గోపమాంబ నరసింహాచార్యులవారి తపః ఫలమ్మున

గుర్తింపు తెచ్చిరి పుట్టిన చేగుర్తి గ్రామానికే జగాన

గీర్వాణ విద్వద్వరేణ్యులై ఉదయించిరి శ్రీభాష్యం వంశాన

పేరొందిరి విజయసారథి గురువర్యులు మహామహోపాధ్యాయ నామాన


2.చిరుతప్రాయమందుననే  అమరభాష నేర్చినారు

మాతృమూర్తి స్ఫూర్తితో శ్రీ వ్రతగీతిని కూర్చినారు

షట్ శాస్త్రాలను అవలీలగా ఆపోశన పట్టినారు

యుక్తవయసులోనే ఖండకావ్య సృజన సల్పినారు

నివాళులివే విఖ్యాత మందాకిని గ్రంథకర్తకు

నీరాజనాలు సంస్కృత సీసశ్ఛందావిష్కర్తకు


3.దేశభక్తి ప్రేరేపిత భారతభారతి కావ్య కవనమ్

కృష్ణభక్తి పూరిత రసరమ్యం సంగీత మాధవమ్

వెలయించిరి యజ్ఞవరాహక్షేత్రం వైదిక సంస్థానమ్

వరించెనీ శతాధిక కృతికర్తను పద్మశ్రీ పురస్కారమ్

నివాళులివే విఖ్యాత మందాకిని గ్రంథకర్తకు

నీరాజనాలు సంస్కృత సీసశ్ఛందావిష్కర్తకు

No comments: