https://youtu.be/NCkr_EO8a4o
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:చక్రవాకం
రూపును వర్ణించితి-గుణములు కీర్తించితి
నీ ఉనికిని మరిమరీ నొక్కివక్కాణించితి
లీలలను మహిమలను గీతాలుగ పాడితి
నిజముగనే నీనామ భజనమునే చేసితి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
1.పొల్లుపోకుండగనూ కవితలు వెలయించితి
ఉన్న ప్రతిభనంతటినీ నీకై కుమ్మరించితి
తనువు మనసు ధనము నీకోసం వెచ్చించితి
మదిలో మాటలొ పనిలో శివా నిన్నే నిలిపితి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
2.ఒకవైవే ఉంటే ఎలా హరహరా శ్రద్ధాసక్తులు
కడగళ్ళతో అలమటించాలా నాలా నీ భక్తులు
చాలవు అధిగమించ నీ దయలేక మాశక్తియుక్తులు
సంస్తుతి నిందాస్తుతి నిన్నేవీ కదిలించవా మా అభివ్యక్తులు
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
No comments:
Post a Comment