https://youtu.be/Qq7FyrpbWxg
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:సారమతి
ననుగన్న తండ్రివీ దిక్కువు దైవము
అన్ని నీవేనయ్య నరసింహ నమ్ముము
పుట్టిబుద్దెరిగినా ఆనాటినుండి అను నిత్యము
మరువకుంటిని స్వామి మదిలోన నీ నామము
సంతోషమన్నది స్వప్న సదృశమాయే
దిగులుతో దినదినము ఆక్రోశమాయే
1.ప్రహ్లాద వరదుడా నీకేది కనికరము
ఎరిగించవయ్య వేగిరమె నా నేరము
కనులార నీరూపు కాంచితినె శ్రీకాంత
నోరార నీ భజన చేసితిని నీ చెంత
పక్షపాతము వీడు పాహి నను కాపాడు
పక్షివాహన శరణు ప్రభో నీవె నా తోడు
2.కూటికే నోచక బిచ్చమెత్తిన వాడు
చదువు సంధ్యలు చాల నేర్వని వాడు
నీ దాసుడాయెనూ శేషప్ప కవివర్యుడు
శతకాలు వ్రాసి నాడు నీ కృప నొందినాడు
నుతియించినా నన్ను గతిగానవైతివి
పతిత పావన నా మెరలు వినవైతివి
No comments:
Post a Comment