https://youtu.be/Wjn8Gtkq068
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:అభేరి(భీంపలాస్)
పంచవిధ కృతులతో సుప్రభాతం
పంచోపనిషత్తులతో నిత్యాభిషేకం
పంచభక్ష్యాలతో హృదయనైవేద్యం
పంచ జ్యోతులతో దివ్యనీరాజనం
నరహరే భక్తవరద నీకిదే శ్రీ చందనం
ధర్మపురి హరీ స్వామి సాష్టాంగ వందనం
1.గోదావరి దరి అంచున జన్మించితిమి
నీ పాదాల పంచన నే జీవించితిమి
తల్లి తండ్రీ గురువుగ నిన్నెంచితిమి
కనురెప్పగ కాచెదవని విశ్వసించితిమి
మమ్మేలే మా రాజువని భావించితిమి
నరహరే భక్తవరద నీకిదే శ్రీ చందనం
ధర్మపురి హరీ స్వామి సాష్టాంగ వందనం
2.ప్రతిరోజూ ఇరుసంధ్యల నీదర్శనం
మా మది భక్తి ప్రత్తులకది నిదర్శనం
అనుక్షణం అభయమొసగు నీ సుదర్శనం
ఇహపర సుఖదాయకం నీక్షేత్ర సందర్శనం
పావన ధర్మపురి తీర్థ క్షేత్ర సందర్శనం
నరహరే భక్తవరద నీకిదే శ్రీ చందనం
ధర్మపురి హరీ స్వామి సాష్టాంగ వందనం
No comments:
Post a Comment