https://youtu.be/8Uxvhsp5CYk
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాధా రాధా నా ప్రణయ గాధ
కృష్ణాకృష్ణా నీవేలే నా జీవనతృష్ణ
సృష్టి ఉన్నంత కాలం విశ్వమంత విశాలం
మన అనురాగం మధురస యోగం
మన సంయోగం అపవర్గం
1.నా రేయికి హాయిని కలిగించే వెన్నెలవీవు
నా నోటికి ఉవ్విళ్ళూరించే వెన్నవు నీవు
నీ పదముల కంటిన మట్టిరేణువునే నేను
నా తలనలరించిన నెమలి పింఛము నీవు
2.శ్రుతివే నీవు లయను నేనైన గీతిగా
మువ్వలు నేను మురళివి నీవైన కృతిగా
యుగయుగాలుగా తీరని చిగురాశగా
మన ఆత్మల కలయిక పరమాత్మ దిశగా
No comments:
Post a Comment