https://youtu.be/N1edpKFlK0w
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:రసిక రంజని
జై వీరాంజనేయా జై అసుర భంజనాయ
జయహో నిరంజనాయా మహీజ మాత మనోరంజనాయ
జయము జయము స్వామీ నీకు నీరాజనము
నీనామ స్మరణయే భవ దుఃఖ భాజనము
మంగళ మూరుతి నీకిదే మా ప్రాణహారతి
కొండగట్టు మారుతి నీకిదె మా జీవన హారతి
1.అష్టసిద్ది నవ నిధుల ప్రదాతవు
ఆనంద పరవశావస్థ సంస్థితవు
ఇడుముల దునిమెడి ఇభవరదుడి భక్తుడవు
ఈప్సితముల నెరవేర్చెడి తవభక్త సులభుడవు
మంగళ మూరుతి నీకిదే మా ప్రాణహారతి
కొండగట్టు మారుతి నీకిదె మా జీవన హారతి
2.ఉడతను సైతం బ్రోచిన శ్రీ రామబంటువు
భక్తి శక్తి ముక్తి పదములకు నీవే నిజ నిఘంటువు
ఎంతని పొగడను చింతలు దీర్చే చింతామణివీవు
ఏమని పాడను నీవే మా మనవిని విని కాచే వాడవు
మంగళ మూరుతి నీకిదే మా ప్రాణహారతి
కొండగట్టు మారుతి నీకిదె మా జీవన హారతి
No comments:
Post a Comment